Telugudesam: మీ నాన్నకు ఆలోచన లేకుండానే నాడు మండలిని పునరుద్ధరించారా?: వైఎస్ జగన్ కు గోరంట్ల సూటి ప్రశ్న

  • శాసనమండలిని రద్దు చేయాలన్న వైసీపీ ప్రభుత్వ యోచనపై విమర్శలు
  • అప్పటి సీఎం వైఎస్ 2007లో మండలిని పునరుద్ధరించారు
  • ప్రతిభావంతులకు కేంద్రంగా ఉండాలని ఆ పని చేశారు

ఏపీ శాసనమండలిని రద్దు చేయాలన్న యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టు వస్తున్న వార్తలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. రాజమహేంద్రవరంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అప్పటికే రద్దయి ఉన్న శాసనమండలిని 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునరుద్ధరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

విభిన్న రంగాల్లో ప్రతిభావంతులకు కేంద్రంగా శాసనమండలి ఉండాలని భావించి దానిని పునరుద్ధరిస్తున్నట్టు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన విషయాలను గుర్తుచేశారు. ‘మరి, మండలిని మీ నాన్న ఎందుకు పెట్టించాడు .. మూర్ఖుడా? మీ నాన్నకు ఆలోచన లేకపోయిందా?’ అంటూ సీఎం జగన్ కు సూటి ప్రశ్నలు వేశారు. వైసీపీ నేతలకు శాసనమండలిలో అవకాశాలు ఇస్తానని ఇటీవల జగన్ చెప్పిన విషయాన్నీ ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News