Karona: విజృంభిస్తున్న కరోనా... 2 వేల మందికిపైగా వ్యాధి!

  • ఇప్పటివరకూ 56 మంది మృతి
  • పరిస్థితిని సమీక్షిస్తున్నాం
  • పోలిట్ బ్యూరో సమావేశంలో జీ జిన్ పింగ్

చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి, ఆపై ఒక్కో దేశానికీ విస్తరిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్, రోజురోజుకూ మరింతగా విజృంభిస్తోంది. ఇప్పటికే చైనాలో 2 వేల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారని చైనా అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ 56 మంది మరణించారని ఆదివారం నాడు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.

వైరస్ ను అరికట్టడంపై పోలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించిన అధ్యక్షుడు జీ జిన్ పింగ్, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య శాఖ నిపుణులు కృషి చేస్తున్నారని అన్నారు.

కాగా, గత సంవత్సరం చివరిలో చైనాలోని ఓ సీఫుడ్ మార్కెట్ నుంచి ఈ వైరస్ వ్యాప్తి మొదలైంది. తొలుత వూహాన్ సిటీలో కనిపించిన కరోనా, ఆపై బీజింగ్, షాంగైలకు విస్తరించింది. యూఎస్, థాయ్ లాండ్, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లోనూ కనిపించింది. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించగా, పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ బృందాలను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News