Andhra Pradesh: మండలి రద్దుపై 'నో కామెంట్' అన్న షరీఫ్!
- కౌన్సిల్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన షరీఫ్
- సభలో రూల్స్ ప్రకారమే నడుచుకున్నానని వెల్లడి
- తనను దూషించడం సాధారణమేనన్న షరీఫ్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తారన్న వార్తలపై స్పందించేందుకు మండలి చైర్మన్ షరీఫ్ నిరాకరించారు. ఈ ఉదయం రిపబ్లిక్ వేడుకల సందర్భంగా కౌన్సిల్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం షరీఫ్ మీడియాతో మాట్లాడారు. పాలన వికేంద్రీకరణ బిల్లుపై రెండు రోజుల్లో సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. మండలి రద్దుపై స్పందించాలని కోరగా, 'నో కామెంట్' అంటూ సమాధానాన్ని దాటవేశారు. తాను నిబంధనలను అతిక్రమించలేదని, రూల్స్ ప్రకారమే నడుచుకున్నానని షరీఫ్ స్పష్టం చేశారు. తనను దూషించడం సాధారణమేనని అభిప్రాయపడ్డ ఆయన, బిల్లులను రిఫర్ చేశామని, తాను రూలింగ్ ఇచ్చిన తరువాత, ఓటింగ్ అవసరం లేదని తెలిపారు. బిల్లు ప్రస్తుతం కౌన్సిల్ కస్టడీలో ఉందని ఆయన అన్నారు.