AP Legislative Council: సెలెక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వాలని రాజకీయపార్టీలకు లేఖ
- రాజకీయపార్టీలకు లేఖ రాసిన మండలి చైర్మన్
- రెండు బిల్లులకు రెండు సెలెక్ట్ కమిటీలు
- ఒక్కో కమిటీలో తొమ్మిది మంది సభ్యులు
ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ తన విచక్షణాధికారాలను ఉపయోగించి మండలి చైర్మన్ షరీఫ్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి అడుగు పడింది. రాజకీయపార్టీలకు మండలి చైర్మన్ లేఖ రాశారు. సెలెక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వాలని ఆయా పార్టీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ రెండు బిల్లులకు రెండు సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఒక్కో సెలెక్ట్ కమిటీలో 9 మంది సభ్యులు ఉండనున్నారు. ఆయా కమిటీలకు చైర్మన్లుగా సంబంధిత శాఖల మంత్రులు వ్యవహరించనున్నారు.