Telugudesam: ఆ సామాజిక వర్గాల వారే జగన్ కు భవిష్యత్ లో సమాధానం చెబుతారు: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల
- బీసీలను ఉద్ధరిస్తానని చెప్పిన జగన్ ఇదా చేసేది?
- మండలి రద్దు నిర్ణయంతో వారిని మాట్లాడనివ్వరా?
- బీసీలు ఎవరూ జగన్ ని క్షమించరు
శాసనమండలి రద్దు ద్వారా ఏవైతే బడుగు, బలహీన సామాజిక వర్గాలను మాట్లాడనీయకుండా సీఎం జగన్ చేశారో, ఆ సామాజిక వర్గాల వారే ఆయనకు భవిష్యత్ లో సమాధానం చెబుతారని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు హెచ్చరించారు. మంగళగిరిలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రచారంలో, పాదయాత్రలో బీసీలను ఉద్ధరిస్తానని చెప్పిన జగన్, వారికి గండికొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, బీసీలు ఎవరూ జగన్ ని క్షమించరని అన్నారు.
బీసీలను, ఎస్సీలను జగన్ ఎంతగా అణగదొక్కుతున్నారో చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ అంటూ రామానాయడు మాట్లాడుతూ, కేబినెట్ ర్యాంకుతో 23 మందిని తన అడ్వయిజర్స్ పేరిట జగన్ తీసుకున్నారని, అందులో 19 మంది అగ్రవర్ణాల వారేనని, అందులోనూ ఆయనకు సంబంధించిన వర్గం వారే ఎక్కువని, కేవలం నలుగురు మాత్రం ఎస్సీ, బీసీలు మాత్రమేనని విమర్శించారు.