Vijay Sai Reddy: మండలి అవసరం లేదని నాడు 'ఈనాడు'లో ఎడిటోరియల్... ఆ కాపీని పోస్ట్ చేసి సెటైర్లు వేసిన విజయసాయి రెడ్డి!
- శాసన మండలి ఓ గుదిబండే
- రద్దయితే ఏ ప్రమాదమూ జరుగదు
- 1983లో ఈనాడులో ఎడిటోరియల్
ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి అవసరం లేదని, అది ఓ గుదిబండ వంటిదని, దాని రద్దు గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని, దాదాపు 37 సంవత్సరాల క్రితం 'ఈనాడు' దినపత్రికలో ప్రచురితమైన సంపాదకీయాన్ని గుర్తు చేసిన విజయసాయి రెడ్డి, పచ్చ మీడియాకు విధానాలు ఉండవని సెటైర్లు వేశారు. ఇప్పుడు విజయసాయి వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
"ఎల్లో మీడియాకు నిర్ధిష్ట విధానాలంటూ ఏముండవు. జాతి ఆశాకిరణం చంద్రబాబు ఏ లైన్ తీసుకుంటే దాన్ని అనుసరించడమే వాటికి తెలిసిన జర్నలిజం. అప్పట్లో కౌన్సిల్ దండగని ఎడిటోరియల్స్ రాసిన పచ్చ పత్రికలు ఇప్పుడు భిన్నంగా రాసి 'జ్ఞానాన్ని' వెదజల్లుతున్నాయి" అని ఆయన అన్నారు.
కాగా, 1983, మార్చి 28, సోమవారం ప్రచురితమైనట్టుగా కనిపిస్తున్న ఈ ఎడిటోరియల్ వ్యాసంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్టు గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడటం గమనార్హం.