YS Vivekananda Reddy: తండ్రి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలంటూ.. హైకోర్టులో వైయస్ వివేకా కుమార్తె పిటిషన్

  • ప్రతివాదులుగా సీబీఐ, ఏపీ హోంశాఖ
  • ఇప్పటికే ఇవే పిటిషన్లు వేసిన మరో ముగ్గురు
  • 2019 మార్చి 14న హత్యకు గురైన వివేకా

వైయస్ వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో సీబీఐ, ఏపీ హోంశాఖలను ప్రతివాదులుగా చేర్చారు. కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఇప్పటికే వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే కేసు విచారణ తుది దశకు చేరుకుందని... ఈ తరుణంలో సీబీఐ విచారణ అవసరం లేదని ఇప్పటికే కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

2019 మార్చి 14న తన నివాసంలోనే వైయస్ వివేకా దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కేసును సిట్ విచారిస్తోంది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసును విచారించింది. అయితే, జగన్ సీఎం అయిన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేశారు. కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు వైసీపీ, టీడీపీ నేతలను సిట్ అధికారులు విచారించారు.

  • Loading...

More Telugu News