Sensex: నేడు కూడా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 188 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 58 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- నాలుగున్నర శాతం వరకు నష్టపోయిన ఎయిర్ టెల్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు... మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్స్, ఐటీ, రియాల్టీ మినహా మిగిలిన సూచీలన్నీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 188 పాయింట్లు పతనమై 40,966కి పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 12,060 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.47%), బజాజ్ ఫైనాన్స్ (1.16%), సన్ ఫార్మా (1.04%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.93%), టీసీఎస్ (0.58%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-4.43%), టాటా స్టీల్ (-3.14%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.20%), మారుతి సుజుకి (-2.06%), నెస్లే ఇండియా (-1.71%).