BJP: భైంసాలో ఒక్క వార్డూ గెలవని టీఆర్ఎస్సా మా పార్టీని విమర్శించేది?: టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

  • టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ
  • తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దు చేయాలి
  • ఆంధ్రా ప్రాంత ఎంపీతో ఇక్కడ ఓటు ఎలా వేయిస్తారు?

టీఆర్ఎస్ పై టీ-బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా జరిగిన మున్పిపల్ ఎన్నికల్లో భైంసాలో ఒక్క వార్డూ గెలుచుకోలేకపోయిన టీఆర్ఎస్సా తమ పార్టీపై విమర్శలు చేసేది? అని ప్రశ్నించారు. నిజామాబాద్ లో మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు.

ఇక్కడ మూడో స్థానంలో వున్న టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి మేయర్ పీఠాన్ని దక్కించుకుందని ఆరోపించారు. ఈ సందర్భంగా తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎంపీతో ఇక్కడ ఓటు ఎలా వేయిస్తారని ప్రశ్నించారు. దేశంలోని తమ ఎంపీలందరితో ఓటు వేయిస్తే కనుక టీఆర్ఎస్ కు ఒక్క మున్సిపల్ చైర్మన్ పదవి కూడా దక్కదని వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. 2023లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని దీమా వ్యక్తం చేసిన లక్ష్మణ్, ఈ అంశంపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు.

  • Loading...

More Telugu News