Amaravati: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అమరావతి మహిళా రైతు మృతి

  • మందడం గ్రామానికి చెందిన భారతి మృతి
  • రాజధాని ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న భారతి
  • ఆవేదనతో అస్వస్థతకు గురైన వైనం

రాజధానిని తరలించవద్దంటూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు 43వ రోజుకు చేరుకున్నాయి. మరోవైపు, రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం తరలిస్తోందనే ఆందోళనతో ఇప్పటికే పలువురు రైతులు, రైతు కూలీలు ప్రాణాలు వదిలారు. తాజాగా అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో విషాదం నెలకొంది.

 రాజధాని అంశంపై ఆవేదనతో భారతి (55) అనే మహిళా రైతు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఆమె మృతి చెందారు. రాజధాని కోసం ఆమె కుటుంబం తమకున్న అర ఎకరం భూమిని ఇచ్చింది. రాజధాని ఉద్యమంలో ఆమె చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఒత్తిడిని జయించలేక చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణంతో ఆ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News