BJP: ఢిల్లీలోని పార్లమెంటు లైబ్రరీ భవన్‌లో అఖిలపక్ష భేటీ
- పార్లమెంటు వ్యవహారాల మంత్రి నేతృత్వంలో సమావేశం
- రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
- సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరుతోన్న ప్రభుత్వం
రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఈ రోజు అఖిలపక్షం సమావేశమైంది. పార్లమెంటు లైబ్రరీ భవనంలో కొనసాగుతోన్న ఈ భేటీకి పలువురు ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను ప్రభుత్వం కోరుతోంది.
కాగా, ఈ సారి పార్లమెంటు సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. రేపటి నుంచి ఫిబ్రవరి 11 వరకు సమావేశాలు జరిగి వాయిదా పడతాయి. మళ్లీ మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకూ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో సీఏఏ, ఎన్నార్సీ, దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.