Sensex: స్టాక్ మార్కెట్లపై పంజా విసిరిన కరోనా వైరస్
- 284 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 93 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- ఉదయం నుంచి నష్టాల్లోనే కొనసాగిన సూచీలు
నిన్న లాభాల బాట పట్టిన మార్కెట్లు ఈరోజు మళ్లీ పతనమయ్యాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. దీంతోపాటు, బలహీనంగా ట్రేడ్ అయిన ఆసియా మార్కెట్ల ప్రభావం కూడా మన మార్కెట్లపై పడింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 284 పాయింట్లు నష్టపోయి 40,913కు పడిపోయింది. నిఫ్టీ 93 పాయింట్లు కోల్పోయి 12,035 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఆటో (1.48%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.91%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.91%), ఎన్టీపీసీ (0.57%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.25%).
టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.54%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.09%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.07%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.03%), సన్ ఫార్మా (-1.92%).