BJP: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
- ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తోన్న రాష్ట్రపతి
- 45 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం
- రేపు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తున్నారు. దేశమంతా ఆర్థిక సంక్షోభం నెలకొందని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై దేశమంతా ఎదురుచూస్తోంది.
అలాగే, ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం దాదాపు 45 బిల్లులను ప్రవేశపెట్టనుంది. నిన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరింది. సీఏఏ, ఎన్నార్సీ, దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్ష పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. రేపు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.