India: వూహాన్‌లో ఆరుగురు భారత విద్యార్థులకు హైఫీవర్.. విమానం నుంచి దించివేత
- వూహాన్‌లో 350 మంది భారత విద్యార్థులు
- తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని పంపిన భారత ప్రభుత్వం
- మిగిలిన వారితో బయలుదేరిన విమానం
కరోనా వైరస్‌తో చైనా వణుకుతున్న నేపథ్యంలో వూహాన్‌లోని భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 747 జంబో విమానాన్ని వూహాన్ పంపింది. మొత్తం 350 మంది విద్యార్థులను భారత్‌కు తరలించాల్సి ఉండగా, అందులో ఆరుగురు తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో ఇమిగ్రేషన్ అధికారులు వారిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీంతో మిగిలిన వారితో విమానం బయలుదేరింది. వూహాన్‌లో మిగిలిన వారి కోసం మరో విమానాన్ని పంపనున్నట్టు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.