wuhan: విద్యార్థులతో ఢిల్లీలో ల్యాండ్ అయిన విమానం.. చావ్లా క్యాంపునకు తరలింపు.. 14 రోజుల అబ్జర్వేషన్!

  • కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆర్మీ క్యాంపునకు విద్యార్థుల తరలింపు
  • 14 రోజుల పాటు వైద్య పరీక్షలు
  • ఆ తర్వాతే ఇంటికి

భారత విద్యార్థులతో చైనాలోని వూహాన్ నగరం నుంచి బయలుదేరిన ఎయిరిండియా ప్రత్యేక విమానం కొద్దిసేపటి క్రితం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ) విద్యార్థులను బయటకు రానివ్వకుండా ప్రత్యేక వాహనం ద్వారా, ప్రత్యేక మార్గంలో వారిని విమానాశ్రయం వెలుపలికి తీసుకువచ్చారు. అనంతరం వారిని చావ్లా క్యాంపునకు తరలించారు. అక్కడ వారిని 14 రోజులపాటు అబ్జర్వేషన్‌లో ఉంచనున్నారు. వైద్య పరీక్షల అనంతరం వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తేలిన తర్వాత వారని ఇళ్లకు పంపనున్నారు.

వూహాన్‌లో చదువుకుంటున్న 350 మంది భారత విద్యార్థులను స్వదేశం తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపింది. అయితే, విద్యార్థుల్లో ఆరుగురు తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో విమానం ఎక్కేందుకు వారికి అనుమతి లభించలేదు. దీంతో మిగతా విద్యార్థులతో విమానం బయలుదేరింది.

  • Loading...

More Telugu News