Mohammad Shami: చీర కట్టుకున్న కూతురిని చూసి... నిన్ను కలవాలని ఉందంటూ క్రికెటర్ షమీ భావోద్వేగ పోస్ట్!

  • వాట్స్ యాప్ లో తండ్రికి ఫోటో పంపిన ఐరా
  • చాలా అందంగా కనిపిస్తున్నావంటూ కామెంట్
  • త్వరలోనే కలుస్తానని చెప్పిన షమీ
భారత క్రికెట్ ప్రధాన బౌలర్ మహమ్మద్ షమీ, తన కుమార్తె చీర కట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో చూసి భావోద్వేగానికి గురవుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. షమీ గారాల పట్టి ఐరా షమీ, పసుపు పచ్చ రంగు చీర కట్టుకుని ఫొటో దిగి, వాళ్ల నాన్నకు వాట్స్ యాప్ లో షేర్ చేసింది.

దీనిపై స్పందించిన షమీ, నిన్ను కలవాలని ఉందంటూ కామెంట్ చేశాడు. "చీరలో చాలా అందంగా కనిపిస్తున్నావు. నిన్ను దగ్గరకు తీసుకుని ముద్దాడాలని ఉంది. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. అతి త్వరలోనే నిన్ను కలుస్తాను" అని షమీ కామెంట్ చేశాడు. ప్రసుత్తం షమీ న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

Mohammad Shami
Daughter
Ira Shami
Sarry
Social Media

More Telugu News