Union Budget: అంత్యోదయ పథకానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాం: బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్
- ప్రజల ఆదాయాన్ని పెంచేలా బడ్జెట్ ఉంటుంది
- సంపదను సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం
- యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధిని కల్పిస్తాం
లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. తన ప్రసంగం సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంత్యోదయ పథకానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పేదరిక నిర్మూలన, జీనవోపాధి పెంపు, నైపుణ్య శిక్షణ, ఉపాధి, ఆర్థిక చేయూత వంటి కార్యక్రమాలను చేపట్టబోతున్నామని చెప్పారు.
నీటి లభ్యత అత్యంత తక్కువగా ఉన్న 100 జిల్లాలకు ప్రయోజనం కలిగించేలా పథకాలను చేబట్టబోతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా సోలార్ పంపు సెట్లను ప్రోత్సహిస్తామని చెప్పారు. 15 లక్షల మందికి సోలార్ పంపు సెట్లను అందిస్తామని తెలిపారు.
ప్రజల ఆదాయాన్ని పెంచేలా బడ్జెట్ ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. సంపదను సృష్టించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధిని కల్పిస్తామని చెప్పారు.