National Deworming Day: తెలంగాణలో నులిపురుగు నిర్మూలన కార్యక్రమం.. 19 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత మందులు

  • ఈ నెల 10వ తేదీని నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • అన్ని పాఠశాలలు, అంగన్ వాడి సెంటర్లు, మదరసాలల్లో కార్యక్రమాలు
  • అందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరిన ప్రభుత్వం

ఈ నెల 10వ తేదీన తెలంగాణ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తొమ్మిదవ విడత జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని (నేషనల్ డీవార్మింగ్ డే)  ప్రారంభిస్తోంది. ఫిబ్రవరి 17న ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ, ప్రాథమిక విద్యాశాఖ, ఇంటర్మీడియట్ బోర్డ్, బోర్ట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, మహిళా, శిశు సంక్షేమ శాఖలు పాలుపంచుకోనున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని 33 జిల్లాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, మదరసాలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, అంగన్ వాడి సెంట్లర్లను కవర్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఒకటి నుంచి 19 ఏళ్ల వయసున్న పిల్లలకు నులిపురుగులను నివారించే మందులను అందజేయనున్నారు.

పిల్లల ఆరోగ్యానికి డీవార్మింగ్ అనేది చాలా ముఖ్యమైనది. నులిపురుగుల వల్ల పిల్లలకు అనేక అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు వారిలో నులిపురుగులు ఉంటే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. నులి పురుగులనేవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు.

వీటి ద్వారా శరీరంలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. నులిపురుగుల నిర్మూలనతో రక్తహీనత నియంత్రణ, పోషకాల గ్రాహ్యతను మెరుగుపర్చే ప్రయోజనాలు కలుగజేస్తుంది.

 రక్త హీనత, పోషకాహారలోపంతో బాధపడుతున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మానసిక, శారీరక దృఢత్వాన్ని కూడా పెంచుతుంది. తద్వారా పిల్లలు తమ చదువుపై మరింత శ్రద్ధను చూపుతారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులందరూ తమ పిల్లల కోసం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కోరింది.

  • Loading...

More Telugu News