Union Budget 2020: తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు!: టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
- పెట్టుబడిదారుల కొమ్ముకాసేలా ఈ బడ్జెట్ ఉంది
- సామాన్యుల ఆశలపై మోదీ ప్రభుత్వం నీళ్లు చల్లింది
- కేంద్ర బడ్జెట్ పై ఉత్తమ్, పొన్నాల విమర్శలు
కేంద్ర బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ బడ్జెట్ లో ‘తెలంగాణ’కు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ తమను నిరుత్సాహపరిచిందని చెప్పారు.
బడ్జెట్ లో విభజన హామీల ప్రస్తావనే లేదు!: పొన్నాల లక్ష్మయ్య
టీ-కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, పెట్టుబడిదారుల కొమ్ముకాసేలా ఈ బడ్జెట్ ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సామాన్యుల ఆశలపై మోదీ ప్రభుత్వం నీళ్లు చల్లిందని ధ్వజమెత్తారు. ఏడాదిలో జీడీపీ పది శాతానికి పెంచుతామనడం, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెబుతూ ‘ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు?’ అంటూ కేంద్రబడ్జెట్ పై పొన్నాల విమర్శలు చేశారు. బడ్జెట్ లో విభజన హామీల ప్రస్తావనే లేదని, టీఆర్ఎస్ ఎంపీలు ఏం చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదని అన్నారు.