Nirbhaya: నిర్భయ కేసు: వినయ్ శర్మ పిటిషన్ తిరస్కరణకు గురైన కొన్ని గంటల్లోనే అక్షయ్ ఠాకూర్ పిటిషన్
- రాష్ట్రపతి క్షమాభిక్ష కోరిన అక్షయ్ ఠాకూర్
- అంతకుముందు సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్ వేసిన దోషి
- తిరస్కరించిన అత్యున్నత న్యాయస్థానం
- నిర్భయ దోషుల ఉరి మరింత ఆలస్యమయ్యే అవకాశం
నిర్భయ దోషుల ఉరితీత మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నలుగురు దోషుల మరణశిక్ష అమలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. కాగా, నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరగా, అతని పిటిషన్ తిరస్కరణకు గురైంది.
ఈ పరిణామం చోటుచేసుకున్న కొన్ని గంటల్లోనే మరో దోషి అక్షయ్ ఠాకూర్ రాష్ట్రపతి క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. అక్షయ్ ఠాకూర్ ఇప్పటికే సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయగా, ఐదుగురు సభ్యుల ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. ప్రజల నుంచి వచ్చే ఒత్తిళ్లతోనే ఇలాంటి కేసుల్లో దోషులకు అన్నింటికీ ఒకటే మంత్రంలా మరణశిక్ష విధిస్తున్నారంటూ అక్షయ్ తన క్యూరేటివ్ పిటిషన్ లో పేర్కొనడం గమనార్హం.