Pakistan: పాకిస్థాన్ లో 'మిడతల' ఎమర్జెన్సీ... అధికారులతో ఇమ్రాన్ అత్యవసర సమావేశం!
- పంటలను నాశనం చేస్తున్న మిడతలు
- ఎన్ఏపీ విభాగానికి 730 కోట్లు
- ఇండియాలోకీ వస్తున్న మిడతలు
పొలాలపై పడి పంటలను సర్వనాశనం చేస్తున్న మిడతలపై పోరాడేందుకు పాకిస్థాన్ జాతీయ అత్యయిక పరిస్థితిని విధించింది. అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతులను మిడతల సమస్య నుంచి బయట పడేసేందుకు తక్షణం 730 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఎన్ఏపీ (నేషనల్ ఎమర్జెన్సీ ప్లాన్) విభాగం ఈ నిధులతో మిడతల సమస్యను దూరం చేస్తుందని భావిస్తున్నట్టు ఇమ్రాన్ పేర్కొన్నారు. కాగా, పాకిస్థాన్ నుంచి హద్దులు దాటి భారత్ లోకి ప్రవేశిస్తున్న మిడతలు, గుజరాత్ లో సైతం పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయన్న సంగతి తెలిసిందే.