BJP: హథీరాంజీ మఠం భూములపై వైసీపీ కన్ను.. రేపు మఠం వద్ద ఆందోళన: బీజేపీ భానుప్రకాశ్‌రెడ్డి
- మఠానికి ప్రభుత్వం నియమించిన కస్టోడియన్‌ను తొలగించాలి
- ఆ బాధ్యతను వెంటనే టీటీడీ ఈవోకి అప్పగించాలి
- మఠం భూముల రికార్డులను తారుమారు చేశారు
తిరుపతిలోని హథీరాంజీ మఠం భూముల వ్యవహారంలో ఏపీ సర్కారు ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. మఠం భూములను దుర్వినియోగం చేస్తున్నారంటూ హథీరాంజీ మఠం మహంత్ అర్జున్‌దాస్‌పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
హథీరాంజీ భూములపై వైసీపీ ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. మఠానికి ప్రభుత్వం నియమించిన కస్టోడియన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ బాధ్యతను వెంటనే టీటీడీ ఈవోకి అప్పగించాలని చెప్పారు. మఠం భూములపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మఠం భూముల రికార్డులను తారుమారు చేశారని ఆయన మండిపడ్డారు. రేపు తమ పార్టీ ఆధ్వర్యంలో హథీరాంజీ మఠం వద్ద ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. ఈ భూముల వ్యవహరంపై త్వరలోనే గవర్నర్‌ను కలుస్తామని చెప్పారు.