India: చైనా ప్రయాణికుల పట్ల భారత్ అప్రమత్తత.. ఈ-వీసాలు రద్దు
- వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్
- ఇతర దేశాల్లోనూ కరోనా బాధితులు
- చైనా ప్రయాణికులపై భారత్ ఆంక్షలు
నానాటికీ విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చైనాలో ప్రబలిన ఈ మహమ్మారి ఇతర దేశాలకు శరవేగంతో పాకుతోంది. ఈ నేపథ్యంలో, చైనా నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత్ నిర్ణయించుకుంది. చైనా ప్రయాణికులకు ఈ-వీసాలు జారీ చేయడం నిలిపివేస్తున్నట్టు బీజింగ్ లోని భారత ఎంబసీ తెలిపింది. చైనా పాస్ పోర్టులు కలిగివున్న వారికి మాత్రమే కాకుండా, చైనా నుంచి భారత్ వచ్చే ఇతర దేశాల వారికి కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని భారత దౌత్యాధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు, ఇప్పటికే ఎవరికైనా ఈ-వీసాలు జారీ చేసి ఉంటే, ఆ వీసాలు రద్దవుతాయని భారత ఎంబసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. తప్పనిసరిగా భారత్ వెళ్లాల్సిన కారణాలు చూపిస్తే మాత్రం ప్రత్యేక అనుమతులతో చైనా ప్రయాణికులను భారత్ కు అనుమతిస్తారు.