Nara Lokesh: నారావారిపల్లెలో వైసీపీ సభపై నారా లోకేశ్ వ్యంగ్యం

  • నారావారిపల్లెలో వైసీపీ సభ
  • మూడు రాజధానులపై అవగాహన కోసమంటూ సభ ఏర్పాటు
  • జఫ్ఫాలూ... ఇదీ పరిస్థితి అంటూ లోకేశ్ వ్యంగ్యం
  • సభలో కుర్చీలు ఖాళీ అంటూ మీడియాలో కథనాలు
మూడు రాజధానులపై అవగాహన కల్పించేందుకు వైసీపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఊర్లో వైసీపీ సభ ఏర్పాటు చేయడం పట్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. నారావారిపల్లెలో జరిగిన సభలో జనాలు లేరు, సభ ఖాళీ అంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆయన ట్వీట్ చేశారు. ఆ వీడియో ట్వీట్ లో సభలో కుర్చీలు చాలావరకు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడా తప్ప సభలో పెద్దగా జనాల్లేకపోవడం ఆ వీడియోలో చూడొచ్చు. "జఫ్ఫాలూ... ఇదీ వాస్తవం" అంటూ లోకేశ్ తన ట్వీట్ లో ఎద్దేవా చేశారు.
Nara Lokesh
Naravaripalle
YSRCP
Andhra Pradesh
AP Capital

More Telugu News