Corona Virus: కరోనా అనుమానితులతో నిండిపోతున్న ఫీవర్ ఆసుపత్రి!

  • 9 రోజుల వ్యవధిలో 18 మందికి పరీక్షలు
  • వీరిలో కొందరికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు నిర్ధారణ
  • ఐసోలేషన్ వార్డులో ప్రత్యేక చికిత్స

హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి కరోనా వైరస్ అనుమానితులు క్యూకడుతున్నారు. గత నెల 25 నుంచి నిన్నటి వరకు 18 మంది అనుమానితులు కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. గత నెల 25 నుంచి 27 మధ్య ఐదుగురు అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, నలుగురికి ఏమీ లేదని తేలింది. ఒకరిలో మాత్రం స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో చికిత్స చేసి పంపారు.

 ఇక 28న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కరోనా భయంతో ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. వీరికి కూడా స్వైన్‌ఫ్లూ సోకినట్టు గుర్తించి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించారు. ఆ తర్వాత మరికొందరు కూడా పరీక్షల కోసం ఆసుపత్రికి తరలివచ్చారు. వీరిలో కొందరి నమూనాలను సేకరించి పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు.

ఇటీవల చైనా నుంచి వచ్చిన చందానగర్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తితోపాటు, కర్మన్‌ఘాట్‌కు చెందిన వ్యక్తి (26) శనివారం ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న వీరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి అబ్జర్వేషన్‌లో ఉంచారు. అలాగే, చైనా నుంచి వచ్చిన గోల్కొండకు చెందిన వ్యక్తి (32)కి కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించారు.  

  • Loading...

More Telugu News