yogi adityanath: ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు కేజ్రీవాల్‌కు తెగ బాధగా ఉంది: యోగి ఆదిత్యనాథ్

  • ఉగ్రవాద నిర్మూలనే మా లక్ష్యం
  • విభజన శక్తులకు కేజ్రీవాల్, కాంగ్రెస్ మద్దతు
  • యోగిపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఆప్ ఫిర్యాదు

ఢిల్లీ ఎన్నికల సందర్భంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. నిన్న దక్షిణ ఢిల్లీలోని బదర్పూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో కేజ్రీవాల్ తెగ బాధపడిపోతున్నారని ఆరోపించారు.

ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చూస్తుంటే.. కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు విభజన శక్తులకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే తమ ఏకైక లక్ష్యమని యోగి స్పష్టం చేశారు.

షాహిన్‌బాగ్ నిరసనకారులకు కేజ్రీవాల్ బిర్యానీ సరఫరా చేస్తున్నారంటూ యోగి చేసిన వ్యాఖ్యలపై ఆప్ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల సంఘాన్ని కలిసి యోగిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఎన్నికల ప్రచారం నుంచి ఆయనను బహిష్కరించాలని కోరింది.

  • Loading...

More Telugu News