Maharashtra: అందుకే కుటుంబ సంప్రదాయాలను పక్కనపెట్టి సీఎం అయ్యాను: ఉద్ధవ్ థాకరే

  • బాల్‌ థాకరేకు ఇచ్చిన మాటను అమలు చేయాలి
  • ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవిని స్వీకరించకతప్పదు. 
  •  మాటను అమలు చేసే క్రమంలో ఇది ఓ అడుగు మాత్రమే 

తాము ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించడానికి గల కారణాలపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అవును.. రాజకీయ పదవి ఏదైనా సరే స్వీకరించకూడదన్న థాకరే కుటుంబ సంప్రదాయాన్ని మేము పక్కనపెట్టాం. అయితే, బాల్‌ థాకరేకు ఇచ్చిన మాటను అమలు చేయాలంటే ముఖ్యమంత్రి పదవిని స్వీకరించకతప్పదు. అందుకే నేను ఈ పదవిని స్వీకరించాను' అని తెలిపారు.

'నా తండ్రికి ఇచ్చిన ఓ మాటను అమలు చేసే క్రమంలో ఇది ఓ అడుగు మాత్రమే. ఇప్పటికీ నేను నా తండ్రికి ఇచ్చిన మాటను అమలు చేయలేదు. అమలు చేసే ప్రయత్నంలోనే ఉన్నాను' అని తమ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

కాగా, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గతేడాది నవంబరులో ఉద్ధవ్ థాకరే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

  • Loading...

More Telugu News