Supreme Court: ప్రార్థనాలయాల్లో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో విచారణ గురువారానికి వాయిదా

  • శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్లు
  • మరికొన్ని పిటిషన్లనూ పరిశీలించిన సుప్రీంకోర్టు 
  • మత విశ్వాసాల్లో జోక్యం చేసుకునే అంశంలో న్యాయ పరిధిపై విచారణ
  • న్యాయవాదులకు సమయం ఖరారు చేస్తామన్న సుప్రీం

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఇచ్చిన తీర్పుతో పాటు ఇతర ప్రార్థనా మందిరాల్లో మహిళలు ప్రవేశించకుండా ఉన్న నిషేధాన్ని సవాలు చేస్తూ వచ్చిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టు తెలిపింది.

విచారణ చేపట్టాల్సిన అంశాల క్రోడీకరణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్లపై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే తెలిపారు. మత విశ్వాసాల్లో జోక్యం చేసుకునే అంశంలో న్యాయ పరిధిపై మాత్రమే విచారణను ఖరారు చేస్తారు. ఈ విషయంపై తమ వాదనలు వినిపించేందుకు న్యాయవాదులకు సమయం ఖరారు చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News