tomato: భారీగా పడిపోయిన టమాట ధర.. ఆందోళనలో రైతు!

  • ఇటీవల కిలో టమాట రూ.50 నుంచి రూ.60 మధ్య
  • ప్రస్తుతం రూ.10 నుంచి రూ.15కే లభిస్తున్న టమాట
  • ధరలు పడిపోవడంతో ఆవేదన చెందుతున్న రైతులు

రెండు నెలల క్రితం పంట దిగుబడి గణనీయంగా పడిపోవడంతో బహిరంగ మార్కెట్లో టమాట ధరలు ఒక్కసారిగా భగ్గుమన్న విషయం తెలిసిందే. కిలో టమాట రిటైల్‌ మార్కెట్‌లో రూ.50 నుంచి రూ.60 వరకు ధర పలకడంతో ఇటీవల కొన్నాళ్ల పాటు సామాన్యుడు వాటిని కొనకుండానే మార్కెట్ నుంచి వెనుదిరిగాడు. ప్రస్తుతం టమాట దిగుమతి పెరగడంతో, మార్కెట్లోకి లారీల కొద్దీ వచ్చేస్తోంది.

పర్యవసానంగా ధరలు భారీగా పడిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో టమాట రూ.5 నుంచి రూ.8కి, రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.10 నుంచి రూ.15కే లభిస్తోంది.
 
టమాట ధరలు పడిపోవడంతో తమకు కనీసం రవాణా చార్జీలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్‌, ఎల్బీనగర్‌ మార్కెట్‌, గుడి మల్కాపూర్‌ వంటి ప్రధాన మార్కెట్లు, రైతుబజార్లలో టమాట దిగుమతి అధికంగా ఉంది.

  • Loading...

More Telugu News