Disha Act: ‘దిశ’ బిల్లును వెనక్కి పంపిన కేంద్ర ప్రభుత్వం
- దిశ బిల్లులో సాంకేతిక లోపాలు
- సరిచేసి మళ్లీ పంపాలంటూ కేంద్ర ప్రభుత్వ సూచన
- సాంకేతిక అంశాలను సరిదిద్దే పనిలో నిమగ్నమైన అధికారులు
ఏపీ ప్రభుత్వం 'దిశ' బిల్లును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. అయితే, బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని సూచిస్తూ బిల్లును కేంద్రం వెనక్కి పంపింది. బిల్లులోని 7వ షెడ్యూల్ లో ఎంట్రీలు సరిగా లేవని, వాటిని సరిచేసి మళ్లీ పంపాలని కేంద్రం సూచించింది. దీంతో, సాంకేతిక అంశాలను సరిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
మరోవైపు, ఈ నెల 7న రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్, వన్ స్టాప్ సెంటర్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించబోతున్నారు. అనంతరం ఆదికవి నన్నయ యూనివర్శిటీలో జరిగే కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. ఈ కార్యక్రమంలో దిశ యాప్ ను, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసిజర్ ను ప్రారంభిస్తారు.