Kosta Andhra: కోస్తాను కమ్మేసిన మబ్బులు... పలు చోట్ల వర్షం!
- తీరంపై ఉపరితల ఆవర్తనం
- మరో 24 గంటలు ప్రభావం
- చాలా ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం
తమిళనాడు నుంచి కోస్తా తీరం మీదుగా, ఒడిశా వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో, గత రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోసర్తు వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చిరు జల్లులు కురుస్తుండగా, ఉభయ గోదావరి జిల్లాల్లోని కాకినాడ, రాజమండ్రి, రామచంద్రాపురం, భీమవరం, ఏలూరు, కైకలూరు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్గం కురిసింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. ఉపరితల ఆవర్తనం ప్రభావం మరో 24 గంటలు కొనసాగుతుందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారి ఒకరు వెల్లడించారు.