health: ఉదయాన్నే నిద్రలేవాలంటే ఇలా చేయండి.. మంచి ఉపాయం చెప్పిన పరిశోధకులు
- కఠోర శబ్దంతో ఉండే అలారం వద్దు
- మెలోడీ టోన్‌తో అలారం పెట్టుకోండి
- పరిశోధనల ఫలితంగా వివరించిన ఆస్ట్రేలియా పరిశోధకులు
ఉదయాన్నే నిద్రలేచి చదువుకోవాలనో, వ్యాయామం చేయాలనో అనుకుంటాం. అయితే, ఉదయం పూట మంచం కిందకు దిగాలంటే చాలా మందిలో ఎంతో బద్ధకం ఉంటుంది. అలారం మోగినప్పటికీ దాన్ని ఆఫ్ చేసి పడుకుంటారు. ప్రతిరోజు ఇదే రిపీట్ అవుతుంది. ఇలా ఎందుకు అవుతుంది? అన్న దానిపై పరిశోధనలు చేసిన ఆస్ట్రేలియా ఆర్‌ఎంఐటీ వర్సిటీ పరిశోధకులు ఓ విషయాన్ని కనిపెట్టి, ఉదయాన్నే నిద్ర లేచేందుకు మంచి ఉపాయం చెప్పారు.
అలారం టోన్‌ను మార్చేయమని పరిశోధకులు చెబుతున్నారు.. ఎందుకంటే అలారం టోన్ క్లిక్ క్లిక్ మంటూ కఠోరంగా ఉంటుందని, ఆ టోన్‌కు బదులుగా శ్రావ్యంగా ఉండే మరో టోన్‌ను సెట్ చేసుకోవాలని, మెలోడియస్ అలారం టోన్‌లు విని నిద్ర మేల్కోవచ్చని అంటున్నారు. ఇటువంటి వారి దినచర్య కూడా బాగుంటుందని గుర్తించి వివరించారు.