Under-19 Worldcup: అండర్-19 వరల్డ్ కప్ లో భారత్, పాక్ అమీతుమీ... టాస్ గెలిచిన దాయాది

  • దక్షిణాఫ్రికా వేదికగా అండర్-19 వరల్డ్ కప్
  • సెమీస్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్
  • పోచెఫ్ స్ట్రూమ్ వేదికగా కీలక సమరం
  • మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఏ స్థాయిలో పోటీపడినా అది రోమాంఛకమే అవుతుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లోనూ దాయాదులు పోరాటానికి సిద్ధమయ్యారు. ఇక్కడి పోచెఫ్ స్ట్రూమ్ లో భారత్, పాక్ జట్ల మధ్య సెమీఫైనల్ సమరం ప్రారంభమైంది. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన పాక్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసేసరికి పాక్ 3 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఓపెనర్ హైదర్ అలీ 56 పరుగులు చేసి అవుట్ కాగా, మరో ఓపెనర్ మహ్మద్ హురైరా (4), వన్ డౌన్ బ్యాట్స్ మన్ ఫహాద్ మునీర్ (0) నిరాశపరిచారు.  ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రోహైల్ నజీర్ 41, ఖాసిమ్ ఆక్రమ్ 9 పరుగులతో ఆడుతున్నారు. భారత బౌలర్లలో సుశాంత్ మిశ్రా, రివి బిష్ణోయి, యశస్వి జైశ్వాల్ తలో వికెట్ తీశారు.
Under-19 Worldcup
India
Pakistan
South Africa
Toss
Semifinal

More Telugu News