Nara Lokesh: ఇతనికి పెన్షన్ రద్దయింది!: వీడియోను పోస్ట్ చేసిన నారా లోకేశ్

  • ఏడు లక్షల మంది పెన్షన్లు తీసేశారు
  • ఏకంగా వికలాంగులకు ఇచ్చే పెన్షన్లనూ ఎత్తేశారు
  • తవిట రాజు సరిగా కూర్చో లేడు, మాట్లాడలేడు
అర్హులైన పేదలకు పెన్షన్ల విషయమై ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోమారు విమర్శలు చేశారు. ఏడు లక్షల మంది పెన్షన్లను తీసేశారని, ఎన్నికల ముందు పెంచుకుంటూపోతానని చెప్పిన జగన్, ఇప్పుడు కోసుకుంటూ పోతున్నారని ఎద్దేవా చేశారు. ఏకంగా వికలాంగులకు ఇచ్చే పెన్షన్లనూ ఎత్తేశారని ఆరోపించారు.

ఈ సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువులో నివాసముంటున్న వికలాంగుడు కొండక తవిట రాజు గురించి ప్రస్తావించారు. కనీసం సరిగ్గా కూర్చోలేని పరిస్థితి అతనిది అని, మాట కూడా స్పష్టంగా రాదని, ఇతనికి పెన్షన్ రద్దయిందని తన పోస్ట్ లో లోకేశ్ విమర్శించారు. చంద్రబాబు హయాం నుంచి తన బిడ్డకు పెన్షన్ వచ్చిందని, ఇప్పుడు రావడం లేదని, ఈ విషయమై ఎంతమందిని అడిగినా ఎవరూ స్పందించడం లేదని తవిట రాజు తల్లి చెప్పడం ఈ వీడియోలో కనపడుతుంది.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
cm
Pensions
Handicap
Mangalagiri
Tavita Raju

More Telugu News