Talasani: ఫిబ్రవరి రెండో వారంలో మరోసారి సమావేశం కావాలని తలసాని, చిరు, నాగ్ నిర్ణయం

  • చిరంజీవి నివాసానికి వెళ్లిన మంత్రి తలసాని
  • సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చిరు, నాగ్ లతో చర్చలు
  • సినీ కార్మికుల ఇళ్ల నిర్మాణం కోసం 10 ఎకరాలు
  • నంది అవార్డుల అంశంపైనా చర్చ

హైదరాబాదులో కొలువుదీరిన తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ మెగాస్టార్ చిరంజీవి, అగ్రహీరో నాగార్జునతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలపై చర్చించారు.

శంషాబాద్ లో ఫిలిం ఇన్ స్టిట్యూట్ ఏర్పాటుకు స్థలం కేటాయింపు, సాంకేతిక నిపుణుల స్కిల్ డెవలప్ మెంట్ కు ప్రత్యేకమైన ట్రైనింగ్ సెంటర్, చిత్రపురి కాలనీలో ఆసుపత్రి, పాఠశాల నిర్మాణం, సినీ కార్మికుల ఇళ్ల నిర్మాణానికి 10 ఎకరాల స్థలం కేటాయింపు, కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు జూబ్లీహిల్స్ లో 2 ఎకరాల స్థలం కేటాయింపు తదితర అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. నంది అవార్డుల విషయంపైనా చర్చించారు. ఫిబ్రవరి రెండోవారంలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News