Crime News: కుటుంబ సభ్యుల చేతుల్లో వ్యక్తి దారుణ హత్య
- ఆస్తి తగాదాలే కారణమంటున్న పోలీసులు
- విశాఖ జిల్లాలో దారుణం
- మాకవరపాలెం మండలం పాపయ్యపాలెం శివారులో ఘటన
ఆస్తి కోసం కుటుంబ సభ్యుడినే హత్య చేశారు కొందరు వ్యక్తులు. విశాఖ జిల్లాలో ఈ దారుణం జరిగింది. జిల్లాలోని మాకవరపాలెం మండలం పాపయ్యపాలెం శివారు ముసలిపాలేనికి చెందిన పైల శ్రీను (36) అనే వ్యక్తి నిన్న రాత్రి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆస్తి వ్యవహారాల్లో చెలరేగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనానికి కారణమైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.