Rajinikanth: అలాంటిది ఏదైనా జరిగితే పోరాడే మొదటి వ్యక్తిని నేనే: సీఏఏపై తొలిసారి స్పందించిన రజనీకాంత్

  • ఈ  చట్టంతో భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదు
  • ఒకవేళ ఈ చట్టంతో ముస్లింలకు ఏదైనా ముప్పు జరిగితే పోరాడతా
  • ముస్లింలను దేశం నుంచి పంపిస్తారని ఎలా అనుకుంటున్నారు?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు కూడా జరుగుతున్నాయి. దీనిపై తొలిసారి స్పందించిన సినీనటుడు రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ  చట్టంతో భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదని, ఒకవేళ ఈ చట్టంతో ముస్లింలకు ఏదైనా ముప్పు జరిగితే వారి తరఫున పోరాడే మొదటి వ్యక్తిని తానేనని చెప్పారు.

భారత్, పాక్ విడిపోయిన అనంతరం భారత్‌లోనే ఉండాలని నిశ్చయించుకున్న కోట్లాది మంది ముస్లింలను దేశం నుంచి పంపిస్తారని ఎలా అనుకుంటున్నారని రజనీకాంత్ ప్రశ్నించారు. ఈ చట్టంతో దేశ పౌరులకు ఎలాంటి సమస్యలు ఉండవని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అలాగే, అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులను గుర్తించేందుకు ఎన్‌పీఆర్‌ చాలా ముఖ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News