Asaduddin Owaisi: 'అద్భుతం' అని ఎద్దేవా చేస్తూ.. మెట్రో రైల్ సంస్థపై మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ
- జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో పనులు పూర్తి చేసి, ప్రారంభిస్తున్నారు
- ఇందుకు మీ వద్ద నిధులు ఉన్నాయి
- ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా పనులను ఎప్పుడు మొదలు పెడతారు?
- ఎప్పుడు పూర్తి చేస్తారు?
ఈ నెల 7వ తేదీన మెట్రో రైలు రెండో కారిడార్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మీదుగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ హైదరాబాద్ మెట్రో రైల్ ట్వీట్ చేసింది. ఈ నెల సాయంత్రం 4 గంటలకు ఈ కారిడార్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. మొత్తం 11 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. దీంతో కారిడార్-1 29.. కిలోమీటర్లు, కారిడార్-3.. 29 కిలోమీటర్లతో కలిపి హైదరాబాద్‌లో మొత్తం 69 కిలోమీటర్ల మేర మెట్రోసేవలు అందుతాయని తెలిపింది.
మెట్రోరైల్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. 'అద్భుతం.. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో పనులు పూర్తి చేసి, ప్రారంభించడానికి మీ వద్ద నిధులు ఉన్నాయి. మరి హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మధ్య పనులను ఎప్పుడు మొదలు పెడుతుంది? ఎప్పుడు పూర్తి చేస్తుంది?' అని ప్రశ్నించారు.