CID: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఐడీకి పిఠాపురం విగ్రహాల ధ్వంసం కేసు అప్పగింత!

  • ఆరు ఆలయాల్లోని 12 విగ్రహాల కూల్చివేత
  • హిందూ సంఘాల ఆగ్రహం
  • నిష్పక్షపాత దర్యాప్తునకు కేసు సీఐడీకి అప్పగింత

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం విగ్రహాల ధ్వసం కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు  ఆరు ఆలయాల్లో 12 విగ్రహాలను కూల్చివేశారు. ఆంజనేయస్వామి, సోమేశ్వరస్వామి, సీతారామాంజనేయస్వామి, ముత్యాలమ్మ, కనకదుర్గ ఆలయాల్లోని విగ్రహాలను స్వల్పంగా ధ్వంసం చేశారు. మంగళవారం తెల్లవారుజామున ధ్వంసమైన విగ్రహాలను చూసిన ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.

విగ్రహాల ధ్వంసంపై సర్వత్ర నిరసనలు వెల్లువెత్తాయి. హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు, క్లూస్ టీం బృందాలు ఆధారాలు సేకరించాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ సీఐడీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News