Christina Koch: రోదసీలో అత్యధిక కాలం గడిపి భూమిపై ల్యాండ్ అయిన మహిళా వ్యోమగామి!
- ఐఎస్ఎస్లో 328 రోజులు గడిపిన క్రిస్టినా
- కజకస్థాన్లో తెల్లవారుజామున ల్యాండ్ అయిన స్పేస్‌క్రాఫ్ట్
- ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న నాసా
అమెరికాకు చెందిన మహిళా వ్యోమగామి క్రిస్టినా కోచ్ రికార్డు సృష్టించింది. రోదసీలో అత్యంత సుదీర్ఘకాలం గడిపిన మహిళగా రికార్డులకెక్కింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 328 రోజులు గడిపిన ఆమె సురక్షితంగా భూమిపైకి తిరిగొచ్చింది.
క్రిస్టినాతో పాటు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన లుకా పర్మిటానో, రష్యాకు చెందిన అలెగ్జాండర్ స్క్వోత్సోవ్లను మోసుకొచ్చిన స్పేస్‌క్రాఫ్ట్ తూర్పు కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:12లకు హోస్టన్కు 7 వేల మైళ్ల దూరంలోని కజకస్థాన్లో ల్యాండ్ అయింది. స్పేస్‌క్రాఫ్ట్ పైనుంచి దిగుతూ క్రిస్టినా నవ్వుతూ విజయ చిహ్నం చూపించింది. ఆమె రాకను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.