karona virus: కరోనా వైరస్‌ కలకలంపై ట్రంప్‌తో ఫోనులో మాట్లాడిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

  • ఈ వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగా ఉండదు
  • చైనా ఆర్థికవ్యవస్థ వృద్ధి కొనసాగుతుంది
  • వైరస్‌తో పోరాడేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు

చైనాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగా ఉండదని, చైనా ఆర్థికవ్యవస్థ వృద్ధి కొనసాగుతుందని, ఇందులో ఎటువంటి మార్పులు ఉండవని జిన్‌ పింగ్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఈ వైరస్‌తో పోరాడేందుకు తాము ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదని ట్రంప్‌కు జిన్‌పింగ్ తెలిపారు. ఈ వైరస్‌తో పోరాటాన్ని జిన్‌ పింగ్‌ 'పీపుల్స్‌ వార్‌'గా అభివర్ణించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటూ వేగంగా స్పందిస్తున్నామని తెలిపారు. కాగా, చైనాలో కరోనా వల్ల ఇప్పటి వరకు 636 మంది మృతి చెందారు. ఈ సంఖ్య వేలల్లోనే ఉండొచ్చని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News