Andhra Pradesh: స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలి: ఏపీ ఎస్ఈసీ
- వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్ఈసీ
- కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు
- నోటిఫికేషన్ జారీ నుంచి ఓట్ల లెక్కింపు వరకు కాల వ్యవధి తగ్గింపు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం నుంచి ఎస్ఈసీ రమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం క్షేత్ర స్థాయిలో కలెక్టర్ల పనితీరు సంతృప్తికరంగా ఉందని అన్నారు. పదో తరగతి, ఇంటర్ మీడియట్ పరీక్షలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలు, నిబంధనలు, మార్గదర్శకాల అమలులో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నోటిఫికేషన్ జారీ నుంచి ఓట్ల లెక్కింపు వరకు కాల వ్యవధిని 20 రోజులకు తగ్గిస్తున్నట్టు తెలిపారు.