Chiranjeevi: చిరంజీవి స్థాయికి ఆ పదవి చాలా చిన్నది: తమ్మారెడ్డి భరద్వాజ

  • ఇటీవల చిరు, నాగ్ లతో తలసాని భేటీ
  • నంది అవార్డుల కమిటీ చైర్మన్ పదవి చిరుకు ఇస్తారంటూ ఎప్పట్నించో ప్రచారం
  • చిరంజీవి ఓ సుప్రీం అని పేర్కొన్న తమ్మారెడ్డి
  • చిరుకు అలాంటి పదవులతో అవసరం లేదని వెల్లడి

ఇటీవల తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెగాస్టార్ చిరంజీవి, అగ్రహీరో నాగార్జునలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాళ్ల మధ్య నంది అవార్డుల అంశం చర్చకు వచ్చింది. అయితే, అంతకుముందు నుంచే చిరంజీవిని నంది అవార్డుల కమిటీకి చైర్మన్ గా నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై టాలీవుడ్ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చిరంజీవికి నంది అవార్డుల కమిటీ చైర్మన్ పదవి ఇస్తారని కొంతకాలంగా ఊహాగానాలు జరుగుతున్నాయని, కానీ చిరంజీవి స్థాయికి ఆ పదవి చాలా చిన్నదని అభిప్రాయపడ్డారు.

అలాంటి చైర్మన్ పదవుల్లో ఖాళీగా ఉన్నవాళ్లే ఉంటారని, చిరంజీవి ఎంతో బిజీగా ఉండే వ్యక్తి అని తెలిపారు. అంతేకాదు, ఏదైనా సమస్య వస్తే దాన్ని చిరంజీవిపైకి నెట్టే ప్రయత్నాలు జరుగుతాయని భరద్వాజ అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు చిరంజీవి ఏదైనా చేయగలిగే సుప్రీం స్థాయిలో ఉన్నారని, అలాంటి వ్యక్తికి పదవితో పనిలేదని వివరించారు.

  • Loading...

More Telugu News