Vizag: విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో కొత్త డీపీఆర్ కు ప్రభుత్వ ఆదేశాలు
- ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
- కొత్త డీపీఆర్ రూపకల్పనకు కొటేషన్స్ పిలవాలి
- అమరావతి ‘మెట్రో’ఎండీకి ఆదేశాలు
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్ రూపకల్పన చేయాలని ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు అమరావతి మెట్రో రైల్ ఎండీకి ఆదేశాలు జారీ చేసింది. కొత్త డీపీఆర్ రూపకల్పన నిమిత్తం కొటేషన్స్ పిలవాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ప్రతిపాదన రూపకల్పన నిమిత్తం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, రైట్స్, యూఎంటీసీ తదితర సంస్థలను సంప్రదించాల్సిందిగా ఆ ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది.
కాగా, గతంలో విశాఖ మెట్రో డీపీఆర్ కు సంబంధించి ఎస్సెల్ ఇన్ ఫ్రా కన్సార్టియం కు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. విశాఖలో 79.9 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని చూస్తున్న ప్రభుత్వం, మూడు కారిడార్లలో ‘మెట్రో’ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మెట్రో’తో పాటు మరో 60 కిలో మీటర్ల మోడ్రన్ ట్రామ్ కారిడార్ కూడా ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ యోచన.