Atchannaidu: ‘నాడు-నేడు’ ఓ బోగస్..‘అమ్మఒడి’తో స్కాలర్ షిప్పులకు మంగళం: అచ్చెన్నాయుడు విమర్శలు
- లబ్ధిదారుల నుంచి కమీషన్ తీసుకుంటున్నారు
- టీడీపీ హయాంలో పాఠశాలల్లో అభివృద్ధి జరిగింది
- ఆ అభివృద్ధి పనులకే వైసీపీ సర్కార్ రంగులేసింది
టీడీపీ హయాంలో పాఠశాలల్లో జరిగిన అభివృద్ధి పనులకు రంగులు వేసి ‘నాడు- నేడు’గా చిత్రీకరించే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. పాఠశాలల్లో ‘నాడు-నేడు’ కార్యక్రమం ఓ బోగస్ అని, ఈ పథకం అమలు చేసేందుకు లబ్ధిదారుల నుంచి వెయ్యి రూపాయలు చొప్పున కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల ముడుపులకు ఈ సంఘటనే పరాకాష్ఠ అని మండిపడ్డారు. ‘అమ్మఒడి’ పథకం పేరిట స్కాలర్ షిప్పులకు మంగళం పాడుతున్నారని ధ్వజమెత్తారు.