New Delhi: మరికాసేపట్లో ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఢిల్లీ ఓటరు ఎటువైపు!

  • 70 సీట్లలో పోటీపడుతున్న 672 మంది అభ్యర్థులు
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 1.47 కోట్ల మంది
  • సంక్షేమ పథకాలను నమ్ముకున్న కేజ్రీ.. భావోద్వేగ అంశాలపై బీజేపీ

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఢిల్లీ పీఠాన్ని నిలబెట్టుకోవాలని కేజ్రీవాల్, ఎలాగైనా సొంతం చేసుకోవాలని మోదీ, అమిత్ షాలు గట్టి పట్టుదలగా ఉన్నారు. దీంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సంక్షేమ పథకాలే తిరిగి అధికారాన్ని అందిస్తాయని కేజ్రీవాల్ ధీమాగా ఉండగా, భావోద్వేగ అంశాలనే బీజేపీ నమ్ముకుంది.

ఈ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా 672 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 1.47 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా పోటీపడుతున్నప్పటికీ అది నామమాత్రమే. ఆ పార్టీ పోటీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ కనుక ఓటమి పాలైతే ప్రతిపక్షాలకు మరింత ఊపు లభిస్తుందని, ప్రాంతీయ పార్టీలకు కొత్త ఉత్సాహం వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News