Pavan Kalyan: పవన్ కల్యాణ్ సినిమాకి నో చెప్పిన కైరా అద్వాని

  • పవన్ కోసం కైరాతో సంప్రదింపులు 
  •  డేట్లు ఖాళీ లేవని చెప్పిన కైరా 
  •  వాణీ కపూర్ ను తీసుకునే ఆలోచనలో క్రిష్ 
పవన్ వరుస సినిమాలను అంగీకరించడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'పింక్' రీమేక్ లో చేస్తున్న పవన్, త్వరలో హరీశ్ శంకర్ .. క్రిష్ సినిమాలను కూడా చేయనున్నాడు. ఈ రెండింటిలో క్రిష్ తో చేయనున్నది భారీ చారిత్రక చిత్రం. ఈ సినిమాలో బందిపోటుగా పవన్ కనిపించనున్నాడు.

ఆయన సరసన కథానాయికగా కైరా అద్వానిని తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ జంట మధ్య కెమిస్ట్రీ అదిరిపోతుందని అభిమానులు భావించారు. అయితే వాళ్లకి నిరాశను కలిగిస్తూ ఆమె నో చెప్పేసింది. బాలీవుడ్లో భారీ సినిమాలతో బిజీగా వున్న కైరా, ప్రస్తుతం డేట్లు ఖాళీ లేవని చెప్పిందట. దాంతో వాణీ కపూర్ ను ఎంపిక చేసే ఆలోచనలో క్రిష్ వున్నాడని అంటున్నారు. 2014లో వచ్చిన 'ఆహా కల్యాణం'లో నాని జోడీగా వాణీ కపూర్ కనిపించింది.
Pavan Kalyan
Kiara Adwani
Vani Kapoor
Krish Movie

More Telugu News