Virender Sehwag: నిజానికి, అబద్ధానికి మధ్య ఉన్న తేడా ఇదే: సెహ్వాగ్ ఫన్నీ కామెంట్స్
- నిజమంటే డెబిట్ కార్డు వంటిది
- అబద్ధమంటే క్రెడిట్ కార్డు వంటిది
- సరికొత్త భాష్యం చెప్పిన సెహ్వాగ్
సోషల్ మీడియాలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చాలా యాక్టివ్ గా ఉంటరనే విషయం తెలిసిందే. ఆయన చేసే వ్యాఖ్యలు ఎంతో ఆకట్టుకునేలా ఉంటాయి. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులకు జ్ఞానాన్ని పంచే ప్రయత్నాన్ని సెహ్వాగ్ చేశాడు. నిజానికి, అబద్ధానికి మధ్య ఉన్న తేడా ఏంటో వివరించాడు. నిజమంటే డెబిట్ కార్డు వంటిదని, అబద్ధమంటే క్రెడిట్ కార్డు వంటిదని చెప్పారు. డెబిట్ కార్డు అంటే ఇప్పుడు డబ్బులు చెల్లించి తర్వాత ఎంజాయ్ చేయడమని... క్రెడిట్ కార్డ్ అంటే ఇప్పుడు ఎంజాయ్ చేసి తర్వాత డబ్బులు చెల్లించడమని అన్నారు.