Hyderabad: జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ రసాభాస... మండిపడిన ఎంఐఎం నేతలు
- స్పోర్ట్స్ పేరుతో అవినీతి జరుగుతోందని ఆరోపణలు
- ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ రాజీనామా చేయాలని డిమాండ్
- లక్షల్లో జరిమానాలు వేస్తే పేదలు ఎలా కడతారన్న ఎంఐఎం కార్పొరేటర్లు
హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడీవేడి వాతావరణంలో జరిగింది. స్పోర్ట్స్ పేరుతో అవినీతి జరుగుతోందని ఎంఐఎం కార్పొరేటర్లు ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్ మెంట్ అవినీతికి పాల్పడుతోందని ఎంఐఎం నేతలు మండిపడ్డారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రూ.లక్షల్లో వేసిన జరిమానాలను పేదలు ఎలా కడతారని వారు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే సీఏఏపై ఎంఐఎం సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఇరువర్గాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకున్నాయి.