YSRCP: రాయిటర్స్ సంస్థను చంద్రబాబు నాయుడు ప్రభావితం చేశారు: ఎంపీ గోరంట్ల మాధవ్
- కియా సంస్థ తరలిపోతోందని వార్తను ప్రచారం చేశారు
- రాయలసీమ జిల్లాల్లో దుర్భర పరిస్థితులు ఉన్నాయి
- రాయలసీమకు సీఎం చేస్తున్నది ఇంకా తక్కువే
- రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం
ఆంధ్రప్రదేశ్ నుంచి కియా సంస్థ తరలిపోతోందని వచ్చిన వార్తలపై ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాయిటర్స్ సంస్థను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభావితం చేశారని అన్నారు. కియా సంస్థ ఏపీ నుంచి తమిళనాడుకి తరలిపోతోందని వార్తను ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు.
రాయలసీమ జిల్లాల్లో దుర్భర పరిస్థితులు ఉన్నాయని గోరంట్ల మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు సీఎం జగన్ చేస్తున్నది ఇంకా తక్కువేనని ఆయన చెప్పుకొచ్చారు. రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరుతున్నామని, నీళ్లు, రాయితీలు ఇచ్చి రాయలసీమ యువతను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.